ఈ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే చాన్స్ తక్కువట

న్యూఢిల్లీ: నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దీంతో ఎంత తొందరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పనులపై సైంటిస్టులు బిజీగా ఉన్నారు. మరోవైపు కరోనా ప్రమాద కారకాలను తెలుసుకోవడంపైనా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. తాజాగా వెల్లడైన పరిశోధనల ప్రకారం బ్లడ్ గ్రూప్ సంబంధించి కూడా కరోనా సోకే అవకాశాలు ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా వైరస్ సోకే చాన్సెస్ తక్కువని సైన్స్ డైలీలో ప్రచురితమైన ఓ రిపోర్టు పేర్కొంది. కరోనా పాజిటివ్‌‌ పేషెంట్స్‌‌లో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు స్వల్పంగా ఉన్నారని.. అదే సమయంలో వైరస్ పాజిటివ్‌‌ల్లో ఎక్కువగా ఏ,బీ, ఏబీ గ్రూపుల వారు ఉన్నారని ఆ రిపోర్టు చెప్పింది. అలాగే ’ఓ‘ బ్లడ్ గ్రూప్ వారితో పోలిస్తే ఏ, బీ, ఏబీ గ్రూపుల వారికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి జూలై 30 వరకు 8,41,327 మందిపై నిర్వహించిన రియల్ టైమ్ టెస్టుల ద్వారా ఈ ఫలితాలను వెల్లడించినట్లు సదరు స్టడీ పేర్కొంది. దీనిపై ఇంకా లోతుగా పరిశోధన జరగాల్సి ఉందని సదరు నివేదిక తెలిపింది.

Latest Updates