ఇవాళ ‘బ్లూ మూన్’..చంద్రుడు నీలం రంగులోకి మారుతాడా?

    చంద్రుడు నీలం రంగులోకి మారడు: ప్లానెటరీ సొసైటీ

హైదరాబాద్, వెలుగు: ఫుల్ మూన్ డేపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, చంద్రుడు నీలం రంగులోకి మారతాడన్నది అబద్ధమేనని ప్లానెటరీ సొసైటీ స్పష్టం చేసింది. ‘‘ఈ నెల 2న మొదటి పున్నమి వచ్చింది. శనివారం రెండో పున్నమి ఏర్పడుతుంది. అంతేతప్ప.. ఇది సోషల్ మీడియాలో చెప్తున్నట్లుగా 76 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన సంఘటన కాదు” అని సొసైటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘సాధారణంగా ప్రతినెలా ఒక ఫుల్ మూన్ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకే నెలలో రెండు సార్లు పున్నమి వస్తుంది. ఇలా నెలలో రెండోసారి వచ్చే పున్నమిని బ్లూ మూన్ గా పిలుస్తుంటారు. అదే వాడుకలో ఉంది. అంతేతప్ప చంద్రుడు నీలం రంగులోకి మారతాడన్నది అబద్ధం” అని ప్రకటనలో వివరించారు.

Latest Updates