లేటెస్ట్‌‌ అప్‌‌డేట్స్‌‌తో బ్లూటూత్‌‌

ఈ ఏడాది బ్లూటూత్‌‌లో మరిన్ని అప్‌‌డేట్స్‌‌ తీసుకురానున్నట్లు ‘ద స్పెషల్‌‌ బ్లూటూత్‌‌ ఇంటరెస్ట్‌‌ గ్రూప్‌‌ (ఎస్‌‌ఏజీ)’ ప్రకటించింది. ‘బ్లూటూత్‌‌ ఎల్‌‌ఈ ఆడియో’ ద్వారా కనెక్టెడ్‌‌ డివైజెస్‌‌తో మరింత క్వాలిటీ ఆడియో వినొచ్చు. అది కూడా తక్కువ పవర్‌‌‌‌ వినియోగించుకుంటుందని కంపెనీ తెలిపింది. దీనివల్ల బ్లూటూత్‌‌ డివైజ్‌‌ తయారీ కంపెనీలకు కూడా మేలు జరుగుతుందని చెప్పింది.

కొత్త అప్‌‌డేట్‌‌లో రానున్న ముఖ్యమైన ఫీచర్‌‌‌‌ ‘మల్టీ స్ట్రీమ్‌‌ ఆడియో’. అంటే ఒకే డివైజ్‌‌ నుంచి మల్టీపుల్‌‌ ఆడియో డివైజెస్‌‌ ఒకేసారి కనెక్ట్‌‌ చేసుకోవచ్చు. వినికిడి సమస్యలున్న వారి కోసం కూడా బ్లూటూత్‌‌ టెక్నాలజీలో మార్పులు తెస్తున్నట్లు ‘సిగ్‌‌’ చెప్పింది. ఈ అప్‌‌డేట్స్‌‌ అన్నీ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వస్తాయి.

Latest Updates