ఓపెన్ ప్లేస్ లో ఉమ్మితే రూ.1000 ఫైన్

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ బారినుంచి రక్షించుకోవచ్చనే విషయాలను తెలియజేస్తున్నారు వైద్యాధి కారులు.

కరోనా వైరస్ పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్ణయించింది.  దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయం తీసుకున్న మొదటి రోజే 107 మందిని గుర్తించి వారి నుంచి రూ. 1.06 లక్షల జరిమానా వసూలు చేసింది. వైరస్ నివారణలో ప్రజలు సహకరించాలని BMC కోరింది. ఓపెన్ ప్లేస్ లో ఉమ్మి వేయకుండా పరిశుభ్రత పాటించాలని… నిబంధనను ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు… 189 సెక్షన్ కింద అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది BMC.

Latest Updates