5 రోజుల క్వారంటైన్ తర్వాతే కరోనా టెస్టులు

బీఎంసీ కొత్త గైడ్ లైన్స్

ముంబై: కరోనా లక్షణాలు లేని పేషెంట్స్ కు ఐదు రోజుల క్వారంటైన్ తర్వాతే టెస్టులు నిర్వహిస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. లక్షణాలు లేని పేషెంట్స్ శాంపిల్స్ ను ఐదు రోజుల క్వారంటైన్ కాకముందే తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని సర్కార్ తోపాటు ప్రైవేట్ ల్యాబ్స్ కు సివిక్ బాడీ హెచ్చరించింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం లక్షణాలు కనిపించని పేషెంట్స్ కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో క్వారంటైన్ లో భాగంగా ఐదో రోజు, పద్నాలుగో రోజు పేషెంట్స్ శాంపిల్స్​ను సేకరించనున్నారు. ఈ డెసిషన్ వల్ల ఆస్పత్రుల్లోని బెడ్స్ ను అవసరమైన వారికే కేటాయించే అవకాశం ఉంటుంది. కాగా, బీఎంసీ ప్రతి రోజూ తన విధానాలను మారుస్తోందని సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే రయీస్ షేక్ విమర్శించారు. కొత్త గైడ్ లైన్స్ తో పరిస్థితులను హ్యాండిల్ చేయడం బీఎంసీ స్టాఫ్​ కు కష్టతరమవుతుందని పేర్కొన్నారు.

Latest Updates