తెలుగు, ఉర్దు భాషల్లోనే బోర్డులుండాలి

దుకాణాల సూచిక బోర్డులపై తెలుగుతో పాటు ఉర్దూ భాష లేకుంటే కొనుగోలు చెయ్యమని తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ తెలిపింది. హైదర్ గూడ లోని ఎన్.ఎస్.ఎస్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలోతెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ కన్వీ నర్ అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ..రానున్న 40 రోజుల్లో తాము ఆశించిన ఫలితం రాకపోతే జూన్ 10 నుంచి బడా షాపింగ్ మాల్స్, దుకాణాలు, హోటల్ ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. జంట నగరాల్లో చాలా వరకు ఇంగ్లి ష్ లోనే దుకాణాల సూచిక బోర్డులు రాసి ఉన్నాయని, ఇది తెలుగు, ఉర్దు భాష ప్రేమికులకు అవమానకరంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలుగు, ఉర్దు భాషలలోని దుకాణాల లైసెన్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ సలీం, లక్ష్మీనరసింహ, షైక్ యాసీన్, వంశీ కృష్ణ , శ్రీనివాస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates