నిమజ్జనంలో విషాదం..11 మంది మృతి

మధ్యప్రదేశలో గణపతి నిమజ్జనంలో విషాదం జరిగింది. భోపాల్‌లోని ఖట్లపురాఘాట్‌లో శుక్రవారం ఉదయం గణపతి నిమజ్జనం చేస్తుండగా బోటు బోల్తా పడటంతో 11 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది మృతదేహాలను వెలికితీశామని.. మరో ఐదుగురిని రక్షించారని ఏఎస్సీ అఖిల్ పటేల్ చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానంతో 40 మంది పోలీసులు, గజ ఈతగాళ్లు ఇతర అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర మంత్రి పిసి శర్మ ఘటన చాలా బాధాకరమన్నారు. విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి.

Latest Updates