ముంపు ప్రాంతాల్లో వారిని కాపాడేందుకు బోట్లు వచ్చినయ్‌

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం నుం చి 26, ఏపీ నుంచి 7 బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టేందుకు బోట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మొత్తంగా 33 బోట్లతో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కారు మంగళగిరి, కాకినాడ నుంచి 5 స్పీడ్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన మరో 2 బోట్స్ ను హైదరాబాద్ కు పంపింది. వీటితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టూరిజం డిపార్ట్ మెంట్ కు చెందిన 26 బోట్లను కూడా సిటీకి తీసుకొచ్చారు. వీటిలో 28 స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,5 పెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. రవీంద్రభారతిలోని ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేసుల్లో ట్రక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోట్లను రెడీగా ఉంచారు. బోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్విమ్మర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెల్పర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా సిద్ధం చేశారు. మంగళవారం నదీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ, ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామంతాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీర్జాదిగూడ, మేడిపల్లి, బండంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేట్, ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వరద ముంపు ప్రాంతాలకు 7 బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరలించారు.

వారం రోజుల్లో 6 వేల మంది రెస్క్యూ

వారం రోజులుగా హైదరాబాద్‌ సిటీలోని వరద ప్రాంతాల్లో ఎనిమిది ఎన్డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనిచేస్తున్నాయి. స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎయిర్ బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,పెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధితులను రెస్క్యూ చేస్తున్నాయి. ఇప్పటికీ నీటిలోనే ఉన్న అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జుబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ,అలీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లెలగూడ, మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహాయక చర్యలు చేస్తోంది. సుమారు 6 వేల మందిని రెస్క్యూ చేసిన షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించింది. లోతును బట్టి రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, లోతు తక్కువగా ఉన్న ఏరియాల్లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపయోగిస్తున్నారు.

For More News..

కుండపోత వానలతో టెన్షన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ జనం

Latest Updates