ఎంపీ అర్వింద్‌ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సిద్ధమవుతున్నారా.. అంటే ఔననే అంటున్నారు ఆయన అనుచరులు. మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు కల్పించలేదని షకీల్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన.. ఇవాళ ఉదయం నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ తో సమావేశం అయ్యారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన షకీల్.. . పార్టీ మారితే మారొచ్చు అంటూ స్పందించారు.

Latest Updates