గన్​తో కాల్చుకుని ఎమ్మెల్యే బాడీగార్డ్ సూసైడ్

లక్నో: ఎమ్మెల్యే బాడీగార్డ్ సూసైడ్ చేసుకున్న ఘటన యూపీలో కలకలం రేపింది. బులంద్‌షహర్ జిల్లాలోని రసూల్‌పూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మనీష్ ప్రతాప్ సింగ్ (24) .. మొరాదాబాద్ ఎమ్మెల్యే దేహత్ హజి ఇక్రమ్ ఖురేషికి గన్​మన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదర్శ్ నగర్ ప్రాంతంలో తన నివాసంలో మనీష్​ ప్రతాప్ సింగ్ సర్వీస్ గన్‌తో కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. అతని భార్య గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేసి సమాచారమిచ్చారని, దీనిపై కాట్ఘర్ పోలీస్ స్టేషన్లో సూసైడ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బులంద్​షహర్ జిల్లా ఎస్పీ అమిత్ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపినట్లు తెలిపారు.

Latest Updates