BOE గవర్నర్ పదవిపై ఆశక్తి లేదు : రఘురాం రాజన్

RAGHUబ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(BOE) గవర్నర్ గా భాధ్యతలు చేపట్టనున్నారని వస్తున్న వార్తలపై RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. 2019 జూన్ లో ఖాళీ అవనున్న BOE గవర్నర్ గవర్నర్ పదవిని చేపట్టడంపై తనకు ఆశక్తి లేదని బుధవారం(మే-16) రఘురాం రాజన్ స్ప్రష్టం చేశారు. ప్రస్తుత BOE గవర్నర్ గా ఉన్న మార్క్-కార్నీ పదవీకాలం జూన్-2019 తో యుగియనుంది. దీంతో ఇప్పటివరకూ ఈ పదవిని రఘురాం రాజన్ చేపట్టే అవకాశముందని పత్రికల్లో కధనాలు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో మంచి ఉద్యోగంలో ఉన్నానని, తాను ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా ఉన్నానని, తాను ఫ్రొఫెషనల్ సెంట్రల్ బ్యాంకర్ కాదని లండన్ లో US యూనివర్శిటీస్ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటుచేసిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రఘురాం రాజన్ తెలిపారు. తాను ఏ ఉద్యోగానికి అప్లయి చేయడం లేదని రాజన్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates