బోయింగ్‌ చీటింగ్‌ : 387 మంది చనిపోవడానికి కారణం

అది 29 అక్టోబర్‌‌‌‌ 2018.. బోయింగ్‌ 737విమానం.. ఇండోనేషియా రాజధాని జకర్తా ఎయిర్‌‌‌‌పోర్టు నుంచి ప్యాంకల్‌ పినంగ్‌ కు బయల్దేరింది.. విమానంలో 189 మందిఉన్నారు.. గాల్లో కి లేచిన కాసేపటికే సముద్రంలో కుప్పకూలింది.. అందులోని ప్రయాణికులంతా జలసమాధి అయ్యారు! ప్రమాదం ఎలాజరిగిందో, విమానంలో ఏం లోపం ఉందో ఇప్పటిదాకా తెలియలేదు. కానీ ఇప్పుడు బోయింగ్‌విమానాల తయారీ కంపెనీ సంచలన నిజాన్నిబయటపెట్టింది. ఆ విమానంలో టెక్నికల్‌ లోపంఉన్న సంగతి తమకు ముందే తెలుసని ప్రకటించింది. ప్రమాదంలో ఉన్నప్పుడు హెచ్చరించే సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ వ్యవస్థ ఆ విమానాల్లో సరిగ్గా పనిచేయడం లేదని, అది ప్రమాదానికి దారి తీయొచ్చన్నవిషయం తెలిసినా, ఏం చేయలేకపోయామని తాజాగా ఒప్పుకుంది.

ఈ టెక్ని కల్‌ ప్రాబ్లం వల్లే ఈ ఏడాదిమార్చి 10న ఇథియోపియాలో ఘోర విమాన(ఇది కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 రకానికిచెందిం దే) ప్రమాదం జరిగింది. ఇందులో 157మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ రెండుదుర్ఘటనల్లో కలిపి 346 మంది చనిపోయాకబోయింగ్‌ తన తప్పును ఒప్పుకోవడం గమనా-ర్హం. మొత్తంగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకానికిచెందిన విమాన ప్రమాదాల్లో ఇప్పటిదాకా 387మంది దుర్మరణం పాలయ్యారు.

ఏంటి ప్రాబ్లమ్‌ ?
విమానంలోని సెన్సార్లు పొరపాటుగా పైలట్‌ కువేర్వేరు సమాచారం ఇస్తే దాన్ని గుర్తిం చి, సరిచేసేందుకు బోయింగ్‌ లో ఏఓఏ(యాంగి ల్‌ ఆఫ్‌‌‌‌ అటాక్‌‌‌‌) అనే సిస్టమ్‌ పనిచేస్తుంది. వాస్తవానికిదీన్ని ప్రతి విమానంలో స్టాండర్డ్‌‌‌‌ ఫీచర్‌‌‌‌గా పెట్టాలని బోయింగ్‌ కంపెనీ భావించిం ది. కానీ అప్పటికేఈ సిస్టమ్‌ లేకుం డా కొన్ని విమానాలను అమ్మే -సిన సంగతిని తర్వాత గుర్తించింది. ఇది చిన్నప్రాబ్లమే అని, దీం తో ప్రమాదం జరిగే అవకాశంకూడా ఉండకపోవచ్చని భావించింది. అప్పటికే అమ్మేసిన విమానాల్లో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను అప్‌ డేట్‌ చేస్తేసరిపోతోం దని అనుకుంది. ఈ చిన్న సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ లోపమే ఇండోనేషియా, ఇథియోపియాలోజరిగిన ఘోర ప్రమాదాలకు కారణమైంది.

ఇండోనేషియాలో విమాన ప్రమాదానికి నెల రోజులముం దే ఈ లోపాన్ని బోయింగ్‌ కంపెనీ గుర్తించింది. కానీ ప్రమాదం జరిగిన నెల తర్వాత ఈసాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ప్రాబ్లం గురించి.. అమెరికా ఫెడరల్‌ఏవియేషన్‌ (ఎఫ్‌‌‌‌ఏఏ) దృష్టికి తీసుకెళ్లింది. అంటేఅక్టోబర్‌‌‌‌లో ప్రమాదం జరిగితే నవంబర్‌‌‌‌లో దీనిగురిం చి తెలిపింది. ‘‘ఇది చిన్న ప్రాబ్లమే. ఈలోపంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడాతక్కువే ఉండొచ్చు. కానీ ముం దే ఈ కన్య్ఫూజన్‌ ను తొలగించి ఉంటే బాగుండేది’’ అని ఎఫ్‌‌‌‌ఏఏపేర్కొంది.

Latest Updates