విమానం పడవైంది… నదిలోకి దూసుకెళ్లింది : అంతా సేఫ్

USAలో ఓ పెద్ద విమాన ప్రమాదం తప్పింది. బోయింగ్ 737 కమర్షియల్ విమానం.. రాత్రి సమయంలో క్రాష్ అయింది. ఫ్లోరిడా నదిలోకి దూసుకెళ్లింది. లోతు ఎక్కువగా లేకపోవడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. సిబ్బంది, ప్రయాణికులతో కలిపి.. ఆ టైమ్ లో 136 మంది  విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్లేన్ నీళ్లలో మునిగిపోలేదని ఫ్లోరిడాలోని జాక్సన్ విల్ షెరీఫ్ ఆఫీస్ ప్రకటించింది.  వీరందరికీ ప్రాణాపాయం తప్పిందని… అందరూ సేఫ్ గా ఉన్నారని తెలిపింది. జాక్సన్ విల్ పట్టణ నావల్ ఎయిర్ స్టేషన్ టీమ్ .. రెస్క్యూలో పాల్గొంటోంది.

నది నీళ్లలో ఉన్న విమానం మునిగిపోకుండా… ఎయిర్ బలూన్స్ తో రక్షణ  కల్పించారు. ఒక్కొక్క ప్యాసింజర్ ను బయటకు పంపించి.. చిన్న బోట్లతో ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం ఎందుకు జరిగిందో అనే దానిపై ఏవియేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

 

Latest Updates