బాయిలర్ పేలి నలుగురు మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయికన్ గూడెం దగ్గర మొక్కజొన్నలను ప్రాసెసింగ్ చేసే కంపెనీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలడంతో నలుగురు చనిపోయినట్లు చెబుతున్నారు. పలువురికి గాయలు అయ్యాయి. గాయపడినవారిని పెనుబల్లి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు 50మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దాంతో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి

Latest Updates