రూ.35 కోట్ల వెండిని స్వాధీనం చేసుకున్నపోలీసులు

boinpally-police-seized-in-cilver-lorry

సికింద్రాబాద్ బోయిన్ పల్లి పరిధిలో భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు.  లండన్ నుండి చెన్నయ్ మీదుగా హైద్రాబాద్ కు తరలిస్తుండగా కంటైయినర్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ వాహనంలో  ఉన్న 9 వేల కిలోల వెండి విలువ సుమారు రూ. 35 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.

మేడ్చల్- సుచిత్ర ఏరియాలో… రెండు కంటైనర్లను ఆపి… బ్రింక్స్ సెక్యూరిటీ సర్వీస్ కు చెందిన 2 వాహనాల్లో వెండి కడ్డీలను డంప్ చేశారు డ్రైవర్లు. దీనిపై అనుమానంతో స్థానికులు.. పోలీసులకి సమాచారం ఇచ్చారు. రెండు కంటైనర్లతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. నలుగురు డ్రైవర్లతో పాటు , సెక్యూరిటీ ఏజెన్సీ వారిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Latest Updates