అదుపు తప్పి గుంతలోకి దూస్కెళ్లిన బొలెరో వాహనం

సికింద్రాబాద్ తిరుమలగిరి దగ్గర అదుపు తప్పిన బొలెరో వాహనం పక్కనే ఉన్న గుంతలోకి దూస్కెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.బోయిన్పల్లి మార్కెట్ నుండి ఎల్ఐసి బిల్డింగ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది..ఈ ఘటనలో బొలెరో వాహనంలో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే అతన్ని  ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రమాదానికి అతివేగం కారణమని తెలిపారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం గుంతలోకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది.

Latest Updates