మేయర్‌‌‌‌‌‌‌‌ జుట్టు కత్తిరించి రంగుపూసిన ఆందోళనకారులు

  • ఎర్రరంగును పూసిన ఆందోళనకారులు.. బొలీవియాలో ఘటన

లా పాజ్‌‌‌‌‌‌‌‌: సౌత్‌‌‌‌‌‌‌‌ అమెరికా బొలీవియాలోని  వింటో టౌన్‌‌‌‌‌‌‌‌  మేయర్‌‌‌‌‌‌‌‌ పేట్రిసియా ఆర్సేపై  ఆందోళనకారులు దాడిచేశారు.  వీధుల్లో చెప్పుల్లేకుండా నడిపించారు. ముఖానికి  ఎర్ర రంగు పూశారు. ఆమె జట్టు కూడా  కత్తిరించారు.  ఆ తర్వాత ఆమెను  వింటోలోని పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు.  అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 20న జరిగిన ప్రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు వివాదం కావడంతో ప్రభుత్వ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఇంతవరకు ముగ్గురు చనిపోయారు.   గొడవల్లో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకులు కొందరు వింటోలోని బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌ని మూసేశారు.  ఇంతలోనే బొలీవియా  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ఎవో మోరాల్స్‌‌‌‌‌‌‌‌ మద్దతుదారుల చేతిలో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారంటూ వార్తలు భగ్గుమన్నాయి. మేయర్‌‌‌‌‌‌‌‌ పేట్రిసియా ఆర్సేకు దీంతో సంబంధముందన్న  అనుమానంతో నిరసనకారులు టౌన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌కు  నిప్పుపెట్టారు. మేయర్‌‌‌‌‌‌‌‌ను బలవంతంగా వీధిలోకి  లాక్కొచ్చారు. ‘‘హంతకురాలు’’ అని గట్టిగా అరుస్తూ ముసుగులు వేసుకున్న కొంతమంది ఆందోళనకారులు ఆమెను కింద పడేశారు. జుట్టు కత్తిరించారు. ముఖానికి ఎర్రటి రంగును పూశారు. రాజీనామా పత్రంపై కూడా బలవంతంగా ఆమె చేత సంతకం చేయించారు.  ఆ తర్వాత ఆమెను  పోలీసులకు అప్పగించారు. అధ్యక్ష ఎన్నికల నుంచి  బొలీవియాలో  గొడవలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న  మూమెంట్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ సోషలిజం పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు   ముమ్మరం చేశాయి.  2006లో బొలీవియా  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైన ఎవో మారెల్స్‌‌‌‌‌‌‌‌…. ఈ ఏడాది జరిగిన  ప్రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌  ఎన్నికల్లో రిగ్గింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

Latest Updates