కరోనా నుంచి కోలుకున్న వారు బ్లడ్ డొనేట్ చేయండి

ముంబై : కరోనా నుంచి కోలుకున్న వారు బ్లడ్ డొనేట్ చేయాలని బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, వరుణ్ ధావన్ లు విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ సెల్స్ ఫామ్ అవుతాయని అవి కరోనా వైరస్ ను చంపివేస్తాయని చెప్పారు. బ్లడ్, ప్లాస్మా డొనేషన్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న కృషిని అజయ్ దేవగన్ అభినందించారు. ” కరోనా నుంచి కోలుకున్న వారు టెస్టులు చేయించుకున్న వారు నాలుగు వారాల తర్వాత బ్లడ్, ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. వారిలో ఉండే యాంటీ బాడీస్ కరోనాతో ఫైట్ చేసే వారికి మేలు చేస్తాయి” అని బీఎంసీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను నటుడు అజయ్ దేవగన్ షేర్ చేస్తూ మీరు కరోనా వారియర్స్. కనిపించిన శత్రువుతో చేసే పోరాటానికి సైన్యం కావాలి. మీ బ్లడ్ లో ఈ వైరస్ ను చంపే బుల్లెట్లు ఉన్నాయి దయచేసి రక్తం దానం చేయండి అంటూ కోరాడు. కరోనా బాధితులు కోలుకునేందుకు ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ వారు చేస్తున్న కృషిని తెలుపుతూ హృతిక్ రోషన్, వరుణ్ దేవన్ లు ట్వీట్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారంతా బ్లడ్, ప్లాస్మా డొనేట్ చేయాలని కోరారు.

Latest Updates