బాలీవుడ్ బ్యూటీ బిపాష బసు షూ ఛాలెంజ్

దేశం మొత్తం లాక్డౌన్ లో ఉండటం వల్ల ప్రజలంతా ఇళ్లకే అంకితమయ్యారు. లాక్డౌన్ వల్ల జిమ్ లు మూసివేయడంతో అందరూ ఇళ్లలోనే వ్యాయామాన్ని చేస్తున్నారు. కొంతమంది ప్రముఖులు మాత్రం తమ ఇళ్లలోనే జిమ్ ను ఏర్పాటు చేసుకుంటారు. జనాలు ఇంట్లో ఏపని చేసినా కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే పద్ధతిలో బాలీవుడ్ బ్యూటీ బిపాష బసు కూడా రోజూ చేసే ఎక్సర్ సైజ్ ను కొత్త పద్ధతిలో ట్రై చేశారు.

బిపాష బసు తన వ్యాయామ సమయంలో షూ తో ఒక కొత్త ఛాలెంజ్ ను పూర్తి చేసింది. అందులో వెల్లకిలా  పడుకొని కాళ్లు పైకెత్తి.. ఒక కాలు పాదంపై షూను ఉంచుకుంది. ఆ షూ కిందపడకుండా బోర్లా తిరిగి మళ్లీ వెల్లకిలకు వచ్చింది. అలా కాలును అటు ఇటు తిప్పింది. ఆ ఛాలెంజ్ ను బిపాష రెండు, మూడు ట్రయల్స్ లో పూర్తి చేసింది. ఈ వ్యాయామం ఏదో సరదాకు చేయలేదట. అలా చేయడం వల్ల హిప్ కదలిక బాగుంటుందని ఆమె తెలిపింది. ఆ ఎక్సర్ సైజును వీడియోగా తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇంకేముంది జనాలు కూడా ఆ ఎక్సర్ సైజును ప్రయత్నిస్తున్నారట.

For More News..

కరోనా దెబ్బకు 154 కోట్ల మంది విద్యార్థులు పరేశాన్

కరోనాతో చనిపోయిన భర్త చివరి కోరిక తీర్చిన భార్య

ఆటలో గొడవ.. ఒకరిని చంపి కాల్చేసిన స్నేహితులు

Latest Updates