దర్శకుడు నన్ను రేప్ చేయాలని చూశాడు.. కాపాడాలంటూ ప్రధానికి ట్వీట్ చేసిన హీరోయిన్

సినిమా అవకాశం కోసం వెళ్లిన తనను ఓ దర్శకుడు బలవంతం చేశాడని బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే రెండు వ‌ర్గాలుగా విడిపోయిన ప‌రిశ్ర‌మ ఒక‌రిపై ఒక‌రు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. కంగనా వర్గానికి చెందిన న‌టి పాయ‌ల్ ఘోష్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. సినిమా అవకాశాల కోసం కలిసిన మరుసటి రోజే బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతం చేయబోయాడని బాంబ్ పేల్చింది. ఇప్పటికే సుశాంత్ కేసు విషయంలో కంగనాకు, అనురాగ్ కశ్యప్‌కు మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా పాయల్ చేసిన కామెంట్స్ ఆ వివాదాన్ని మరింత హీటెక్కించాయి.

‘అనురాగ్‌ కశ్యప్ నన్ను చాలా ఘోరంగా బ‌ల‌వంతం చేశాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో దయచేసి చర్య తీసుకోండి. ప్రతిభ ఉన్న దర్శకుడైన కశ్యప్‌లో దాగిన రాక్షసున్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం వల్ల నాకు ప్రాణహాని ఉందని తెలుసు. నా భద్రతకు ముప్పు ఉంటుందని కూడా తెలుసు. దయచేసి సాయం చేయండి’ అని నటి పాయల్ ట్విట్ట‌ర్ ద్వారా ప్రధాని మోడీని కోరింది.

కాగా.. పాయల్ వ్యాఖ్యాలపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. పాయల్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ‘వావ్.. నా నోరు మూయించడానికి మీకు చాలా సమయం పట్టింది. ఫర్వాలేదు.. నా నోరు నొక్కే ప్రయత్నంలో మీరు మరో స్త్రీని ఈ వివాదంలోకి లాగారు. మీరు కూడా ఒక మహిళే. దయచేసి పరిమితులకు కట్టుబడి ఉండండి మేడమ్. మీరు చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవి’అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే పాయల్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ స్పందించారు. లైంగిక ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో తమకు ఫిర్యాదు చేయాలని పాయల్‌కు సూచించారు. ఈ కేసును పోలీసులతో కలిసి విచారిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

For More News..

దేశంలో 54 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,137 కరోనా పాజిటివ్ కేసులు

చనిపోవాలని డిసైడ్​ అయ్యా.. సోషల్​ మీడియాలో నిరుద్యోగి సెల్ఫీ వీడియో

Latest Updates