మోడీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ ఓటు వేయలేదు

ముంబై: సరైన నాయకుడిని ఎంచుకునే సరైన సమయం ఎన్నికలు. ఓటుతో దేశ ఐదేళ్ల పరిపాలన ఎవ్వరి చేతుల్లో ఉంటుందో తెలిపేది ఒటర్లే. అలాంటిది ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సినీస్టార్టస్, ప్రముఖులు సోషల్ మీడియాలో అవేర్ నెస్ పోస్ట్ లు చేశారు. ప్రధాని మోడీ అయితే ఎన్నికలు నెల రోజుల ముందే టాప్ హీరోలకు స్వయంగా ట్వీట్ చేశారు.అయినప్పటికీ కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఓటు హక్కును వినియోగించకోలేకపోయారు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకంటే అతడు ఇటీవల..ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఇంటర్వ్యూ చేసిన ఏకైక బాలీవుడ్ హీరో అక్షయ్ . ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రధానమంత్రి కోరిన మొదటి వ్యక్తి… అక్షయ్ కుమార్.. తీరా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోయాడు. సోమవారం జరిగిన నాలుగో విడత పోలింగ్‌ లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన బాలీవుడ్ ప్రముఖుల్లో ఒకడిగా మిగిలిపోయాడు. అక్షయ్ పంజాబ్‌ లో పుట్టిపెరిగినా, ‘‘కేసరి’’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించినా… పాస్‌ పోర్టు మాత్రం కెనడాకి చెందినది కావడంతో అతడు ఓటువేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చేసేదేమిలేక అక్షయ్ ఓటుకు దూరమయ్యారు. ఇలాంటివి ముందే చూసుకుంటే ఓటు వేసేవారని ట్విట్టర్ లో చెబుతున్నారు ఫ్యాన్స్. ఓటు హక్కును వినియోగించుకోని బాలీవుడ్ స్టార్లలో దీపిక, కత్రిన, అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సన్నీ లియోనీ ఉన్నారు.

 

 

 

Latest Updates