కియారా అద్వానీ ఎకౌంట్ హ్యాక్…

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన ట్విటర్ ఎకౌంట్ హ్యాక్ అయిందని తెలిపింది. తన ఎకౌంట్ వాల్ పై సంబంధం లేని లింక్స్ పోస్ట్ అవుతున్నయని చెప్పింది. ఇందుకు గాను… తన వాల్ పై పోస్ట్ అయిన లింకులను ఎవరూ క్లిక్ చేయవద్దని.. ప్రస్తుతం టెక్నికల్ టీం ఎకౌంట్ ను సరిచేసే పనిలో ఉందని తెలిపింది. ఎకౌంట్ తిరిగి మామూలు స్థితికి వచ్చాక తానే చెబుతానని తన అభిమానులకు, ఫాలోవర్లకు చెప్పింది. హిందీలో వచ్చిన అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ సక్సెస్ తో… స్పీడు మీదున్న కియారా…  ప్రస్తుతం భూల్ భులయ్యా 2- లక్ష్మీ బాంబ్- ఇందూ కి జవానీ లో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తుంది.

Latest Updates