బాలీవుడ్‌ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత రాజ్‌కుమార్‌ బర్జాత్యా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (గురువారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మైనే ప్యార్ కియా, హమ్‌ ఆప్‌కే హై కౌన్‌, హమ్ సాథ్‌ సాథ్‌ హై, వివాహ్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్ పాయో లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.

రాజ్ కుమార్ తండ్రి ప్రఖ్యాత నిర్మాత… కొడుకు ప్రముఖ దర్శకుడు

రాజ్ కుమార్ బర్జాత్యా తండ్రి తారాచంద్ బర్జాత్యా 1960-1980 మధ్య ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ ను స్థాపించింది తారాచంద్ బర్జాత్యానే. ఇదే బ్యానర్ పై రాజ్ కుమార్ బర్జాత్యా సినిమాలు తీశారు. రాజ్ కుమారు కొడుకు… సూరజ్ ఆర్.బర్జాత్యా బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. తాత తారాచంద్ స్థాపించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో .. మైనే ప్యార్ కియా, హమ్‌ ఆప్‌కే హై కౌన్‌, హమ్ సాథ్‌ సాథ్‌ హై, వివాహ్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్ పాయో లాంటి.. మ్యూజికల్ క్లాసిక్స్, సూపర్ హిట్ సినిమాలను అందించాడు సూరజ్.

దాదాపు 70 సంవత్సరాలుగా సినీ రంగంతో సంబంధం ఉన్న రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Latest Updates