కూతురు పేరును ప్రకటించిన బోల్ట్‌

 

కింగ్‌‌స్టన్: జమైకా లెజెండ్‌ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌.. ఎట్టకేలకు తన కూతురి పేరును ప్రకటించాడు. గత నెల 14న తన గాళ్ ఫ్రెండ్‌ కాసీ బెన్నెట్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినా.. అమ్మాయి ఫొటోనుగానీ, పేరును గానీ బోల్ట్‌ ఎక్కడా వెల్లడించలేదు. అయితే బుధవారం బెన్నెట్‌ బర్త్‌ డే సందర్భంగా సోషల్‌‌ మీడియాలో ఫొటోను షేర్‌ చేసి పేరును ప్రకటించాడు. ‘ నా గాళ్ ఫ్రెండ్‌ కాసీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ స్పెషల్‌‌ డేలో నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా. నేను మీ సంతోషాన్ని తప్ప మరేది కోరుకోను. నిన్ను ఎప్పుడూ సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత. మన కూతురు ఒలింపియా లైట్నింగ్‌ బోల్ట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాం’ అని బోల్ట్‌ ట్వీట్‌ చేశాడు.

Latest Updates