పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్

ఐదుగురు అక్కడికక్కడే మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని చమన్ అనే టౌన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. రద్దీగా ఉండే హజీ నిదా మార్కెట్లో ఒక్కసారిగా బాంబు పేలటంతో 5 మంది చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటార్ సైకిల్ కు ఎల్ఈడీ అమర్చి బాంబ్ బ్లాస్ట్ చేసినట్లు తెలిసింది. బాంబ్ బ్లాస్ట్​ జరిగిన ప్లేస్ బెలూచిస్తాన్ ఫ్రావిన్స్ లో ఉంది. దీంతో బెలూచిస్తాన్ వేర్పాటు వాదులే ఈ దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Latest Updates