పదేళ్ల తర్వాత శ్రీలంకలో మారణహోమం

శ్రీలంకలో 25 ఏళ్లు సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసింది. అప్పటి నుంచి లంక ప్రశాంతంగానే ఉంది. కొద్దికాలంగా మెజారిటీలైన కొందరు బౌద్ధ సింహళీయులు మసీదులు, ముస్లింల వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడుతూన్నారు. ఈ పరిస్థితులు చేయిదాటడంతో 2018 మార్చిలో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పదేళ్ల తర్వాత లంకలో బాంబుదాడులతో భయానక పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎల్టీటీఈతో మొదలు లంకలో లిబరేషన్​ టైగర్స్​ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)తో అంతర్యుద్ధం మొదలైంది. ఈ ఉగ్రవాద సంస్థ నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్. తమిళులకు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో 1972లో తమిళ న్యూ టైగర్స్​(టీఎన్​టీ )ని ఏర్పాటు చేశాడు. నాలుగేళ్ల తర్వాత 1976లో టీఎన్ కాస్త ఎల్టీఈగా మారింది. శ్రీలంకలో సుదీర్ఘ అంతర్యుద్ధం, హింసకు ప్రధాన కారణం ఎల్టీఈనే. ఆత్మాహుతి దాడులు, రాజకీయ నేతల, సామూహిక హత్యలు, గెరిల్లా దాడులు ఇలా ఎన్నింటిలోనో ఆరితేరిందీ సంస్థ. ప్రభుత్వ బలగాలు 2009లో ప్రభాకరన్‌ను చంపడంతో అంతర్యుద్ధానికి తెరపడింది.

లంకలో ఎల్టీటీఈ భయానక దాడులివే
1985లో అనురాధాపురలో 146 మంది సింహళ పౌరుల కాల్చివేత.
1987లో హబరనాలో బస్సులో జరిగిన మారణకాండలో 127 మంది బలి.
1987లో కొలంబోలో బాం బు దాడిలో 100 మందికి పైగా మృతి.
1990లో 774 మంది పోలీసుల ఊచకోత.
1990లో కట్టన్​కుడిలోని మసీదులో మారణహోమం. 147 మంది మృతి.
1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాం ధీ హత్య.
1993లో శ్రీలంక ప్రెసిడెంట్ రణసింఘే ప్రేమదాసపై బాంబు దాడి.
1995లో నరమేధం. 120 మంది మృతి.
1996లో కొలంబోని సెంట్రల్ బ్యాంకు వద్ద ట్రక్కు పేల్చివేత. 91 మంది మృతి.
1996లో ములైతివు పట్టణంలో ఆర్మీ క్యాంపుపై దాడి. 200 మంది సైనికుల మృతి.
1996లో కొలంబో సమీపంలో ట్రైన్​పై దాడి. 70 మంది మృతి

Latest Updates