ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి బాంబ్ బెదిరింపు

హైదరాబాద్ : నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్(DPS)కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్లో బాంబు పెట్టామని మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను బయటకు పంపించి.. స్కూల్ మొత్తం డాగ్ స్క్వాడ్ సాయంతో  తనిఖీలు చేపట్టారు.

బాంబ్ బెదిరింపుతో స్థానికంగా కలకలం రేపింది. చుట్టు పక్కలవారు పరుగులు తీశారు. గంట సేపు స్కూల్ మొత్తం తనిఖీలు చేపట్టిన పోలీసులు.. బాంబ్ లేదని తెలుపడంతో అంతా  రిలాక్స్ అయ్యారు. బాంబ్ బెదిరింపుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందా అని ఆరా తీస్తున్నారు.

Latest Updates