మైనర్ బాలికకు ప్రెగ్నెన్సీ.. టెర్మినేషన్‌కు సరేనన్న బాంబే హైకోర్టు

ముంబై: రేప్‌నకు గురైన ఓ మైనర్ బాలిక ప్రెగ్నెన్సీని తీసేయడానికి బాంబే హైకోర్టు అనుమతిని ఇచ్చింది. గత నెలలో తన కూతురు ప్రెగ్నెన్సీపై సదరు బాలిక తల్లి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో పొరుగు వారు తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు బాలిక పేర్కొంది. తొలుత కంప్లయింట్ ఇవ్వడానికి సదరు బాలిక తల్లి సమీపంలోని సంగ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. జూన్ 5న ఎఫ్‌ఐఆర్న మోదైంది. జూన్ 16న బాలికకు ప్రెగ్నెన్సీని తీయించడానికి గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడి డాక్టర్లు అందుకు నిరాకరించారు.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్ర్నంట్ యాక్ట్ 1971 ప్రకారం ప్రెగ్నెన్సీ అయి 20 వారాలు దాటినందున హైకోర్టు పర్మిషన్ లేకుండా  ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ కుదరదని సర్కార్ ఆస్పత్రి డాక్టర్లు ఆమెకు చెప్పారు. దీంతో దీనిపై బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై జూన్ 26న మెడికల్ బోర్డు చర్చించింది. బోర్డు ఇచ్చిన సూచనల మేరకు బాలిక ప్రెగ్నెన్సీని తొలగించేందుకు సమ్మతిస్తూ జస్టిస్ నితిన్ జందార్, జస్టిస్ సురేంద్రలు తీర్పును ఇచ్చారు. బాలిక ప్రెగ్నెన్సీ టెర్మినేషన్‌కు అనుమతించాల్సిందిగా మిరాజ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని హైకోర్టు ఆదేశించింది.

Latest Updates