ఇరాన్ లో ఉగ్రదాడి: 27 మంది మృతి

ఇరాన్ లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. బస్సులో ప్రయానిస్తున్న భద్రతా బలగాలే లక్షంగా ఒక ఉగ్రవాది సుసైడ్ బాంబర్ గా మారి తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో  బస్సు తునాతునకలైంది. అందులో ప్రయానిస్తున్న సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన సౌత్ ఈస్ట్ ఇరాన్ లో బుధవారం రాత్రి జరిగింది.

భధ్రతా బలగాలే లక్షంగా ఉగ్రవాదులు దాడి చేసినట్టు ఇరాన్ పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల ఇస్లామిక్ విజయోత్సవాలకు ప్రతీకగా టెర్రరిస్తులు దాడి చేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. సున్ని మిలిటెంట్ గ్రూప్ అయిన.. జైషే అల్ ఆదిల్ ఉగ్రవాద సంస్థ దాడులు చేసింది తామే అని ప్రకటించినట్టుగా  పోలీసులు తెలిపారు.

Latest Updates