ఫస్ట్​డే రాలేదని స్కూల్ బయటే నిలబెట్టిన్రు

bonala-gurukul-school-in-rajanna-sircilla-district

ఫస్ట్​డే స్కూల్​కు రాలేదంటూ గురుకుల స్టూడెంట్స్​ను లోనికి రానివ్వలేదు. నాలుగు గంటలపాటు స్టూడెంట్లతోపాటు తల్లిదండ్రులు బయటే నిలబడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న చిన్న బోనాల గురుకుల స్కూల్​లో చోటుచేసుకుంది. వేసవి సెలవులకు చిన్న బోనాలతోని తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​స్కూల్​స్టూడెంట్స్​అంతా ఇంటికి వెళ్లారు.

జూన్ 12 స్కూల్స్​తెరిచారు. దూరప్రాంతాల్లో ఉండే దాదాపు 200 మంది స్టూడెంట్స్​13న గురువారం స్కూల్​కు వచ్చారు. ఆలస్యంగా రావడం రూల్స్​కు విరుద్ధమంటూ వారిని ప్రిన్సిపల్ స్కూల్​లోకి అనుమతించలేదు. కరీంనగర్ లోని రీజనల్​ కోఆర్డినేటర్​నుంచి పర్మిషన్​లెటర్​ తీసుకువస్తేనే లోపలికి రానిస్తామన్నారు. దీంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు వెంట తెచ్చుకున్న లగేజీ ఎక్కడ పెట్టుకోవాలి, మళ్లీ కరీంనగర్​ వెళ్లి లెటర్​ ఎట్లా తీసుకురావాలో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. నాలుగు గంటలపాటు బయటే నిల్చున్నారు. చివరకు స్టూడెంట్లతో లెటర్​ రాయించుకుని తర్వాత స్కూల్​లోకి అనుమతించారు.

Latest Updates