గుంటూరు జిల్లాలో ఘనంగా బోనాలు

నాలుగేళ్లుగా  బోనం సమర్పిస్తున్న భక్తులు

ఏపీలోని గుంటూరు జిల్లాలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు బోనం సమర్పించారు. రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  గత నాలుగేళ్లుగా బోనాలు జరుగుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో పొంగళ్లు చేసే భక్తులకు పొంగళ్లు కిట్ లను రంగిశెట్టి జగదీశ్ బాబు, రంగిశెట్టి రమేశ్ బాబు ఉచితంగా పంపిణీ చేశారు. బోనాల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.

Latest Updates