డిసెంబర్ లో ఆర్టీసీ ఎంప్లా యీస్ కు బోనస్ !

త్వరలోనే పీఎఫ్ బకాయిలు చెల్లిస్తాం : ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

హైదరాబాద్ , వెలుగు: వచ్చే డిసెంబర్ లో ఆర్టీసీ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉద్యోగ భద్రతపై వారంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. శనివారం బాగ్ లింగంపల్లిలో ఆర్టీసీ కళా భవన్ లో జరిగి న ఇంధన పొదుపు అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఎండీ సునీల్ శర్మ మాట్లాడారు. ఉద్యోగుల కృషితో 77 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించామని, బస్సుకు మైక్ ఏర్పాటు చేసి చెప్పడంతోనే సాధ్యమైందన్నారు. దీంతోపాటు నెలకు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల రెవెన్యూ వస్తోందన్నారు. త్వరలోనే పీఎఫ్ బకాయిలు చెల్లిస్తామన్నారు. కార్మికులపై అనవసరంగా అధికారుల వేధింపులు ఉండవని స్పష్టం చేశారు.

అన్ని డిపోల్లో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశామని, వీటితో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఆన్ డ్యూటీ, ట్రాన్స్​ఫర్లు తదితర అంశాలపై చర్చిస్తు న్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంధన పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఇందులో నిజామాబాద్ డిపోకు చెందిన జి. నర్సయ్య మొదటి స్థానం దక్కించుకోగా, కె. హాబీబుద్దీన్ సెకండ్ ప్లేస్, ఎం.సైదులు మూడో స్థానంలో నిలిచి అవార్డులు అందుకున్నారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates