ఫస్ట్‌‌ టైం ఇద్దరికి ప్రకటన: అట్‌‌వుడ్‌‌, ఎవ‌‌రిస్టోలకు బుకర్‌‌ ప్రైజ్‌‌

లండన్‌‌: ప్రతి ఏడాది ఒక ఇంగ్లిష్‌‌  రైటర్‌‌కు మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక బుకర్‌‌ ప్రైజ్‌‌ను 1992 తర్వాత ఫస్ట్‌‌టైం ఈ సారి ఇద్దరికి కలిపి ప్రకటించారు. కెనడా రచయిత మార్గరెట్‌‌ అట్‌‌వుడ్‌‌, బ్రిటిష్‌‌ రైటర్‌‌ బెర్నార్డిన్‌‌ ఎవ‌‌రిస్టోలు ఈ అవార్డును పంచుకోనున్నారు. ఇండియన్‌‌ రచయిత సల్మాన్‌‌ రష్దీ రాసిన ‘క్విచొట్టే’ నవల కూడా టాప్‌‌ సిక్స్‌‌ బుక్స్‌‌లో చోటు సంపాదించుకున్నా ఫైనల్‌‌లో నిరాశే మిగిలింది. 79 ఏళ్ల అట్‌‌వుడ్‌‌ రాసిన ‘ద టెస్టమెంట్‌‌’ రచనకు, 60 ఏళ్ల ఎవ‌‌రిస్టో రాసిన ‘గ‌‌ర్ల్‌‌, ఉమెన్‌‌, అద‌‌ర్’ న‌‌వ‌‌ల‌‌ల‌‌కు ఈ అవార్డు దక్కింది. వీరిద్దరూ 50 వేల పౌండ్ల  ప్రైజ్‌‌మ‌‌నీ పంచుకోనున్నారు.

Latest Updates