బుకింగ్స్ షురూ.. దూసుకొస్తున్న ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్లు

bookings-of-strom-r3-three-wheeler-electric-car-open-in-india

న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఫోర్ వీలర్ కార్లనే చూసుంటారు. వాటిలోనే రైడ్స్ ఎంజాయ్ చేసుంటారు. కానీ త్వరలో త్రీ వీలర్ కార్లు మన దేశీ విపణిలోకి రానున్నాయి. మన దేశ రోడ్లపై దూసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్లు రెడీ అవుతున్నాయి. వీటిని తయారు చేస్తున్న స్టార్మ్ మోటార్స్ R3 త్రీ వీలర్ బుకింగ్స్‌‌ను షురూ చేసింది. రూ.10 వేలు చెల్లించి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. స్పోర్టీ లుక్‌‌తో అదరగొడుతున్న ఈ కారులో రెండు సీట్ల క్యాబిన్ ఉంటుంది. మంచి టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ కారు గంటకు 80 కి.మీ.ల వేగం వెళ్తుందని తెలుస్తోంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. అన్ని స్టాండర్డ్, ఫుల్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్న Strom R3 కారు ధర సుమారు రూ.4.5 లక్షలు ఉండొచ్చునని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కారుకు 3 సంవత్సరాల వరకు లక్ష కిలో మీటర్ల వారెంటీ ఆఫర్‌‌ను స్టార్మ్ మోటార్స్ కల్పిస్తోంది.

Latest Updates