కరోనాతో హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌కు బూస్ట్‌

పాలసీ బజార్ స్టడీలో వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా వల్ల భారతీయుల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌పై అవగాహన పెరిగిందని తాజా స్టడీలో తేలింది . తమ స్నేహితులు లేదా బంధువులు ఆస్పత్రుల్లో భారీగా బిల్లులు చెల్లించడాన్ని చూసిన ప్రతి పది మందిలో ఆరుగురు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు గురించి ఆలోచిస్తున్నారని పాలసీబజార్‌ డాట్‌ కాం వెల్లడింది . సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్పత్రి బిల్స్ భారీగా చెల్లించి న వారిలో 60 శాతం మంది హెల్త్ఇన్సూరెన్స్ పాలసీ కొంటామని తెలియజేశారు. ఇక కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా భయాందోళ-నలు నెలకొనడంతో ప్రతి ముగ్గు రిలో ఒకరు పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సర్వే కోసం పాలసీ బజార్ తమ సైట్ నుంచి పాలసీలను కొ న్న నాలుగు వేల మంది నుంచి వివరాలు తీసుకుంది . బ్రాండ్‌ను ఎంచుకునేటప్పుడు, ప్రతి ముగ్గురిలో ఇద్దరు హాస్పిటల్ నెట్‌ వర్క్‌‌‌‌ను బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు.

Latest Updates