ఉద్యోగం మానేస్తున్నారా.. అయితే టీ, కాఫీ డబ్బులు కట్టండి

ఉద్యోగం మానేస్తున్నారా.. అయితే టీ, కాఫీ డబ్బులు కట్టండి

మీరు చైనా కంపెనీల్లో పని చేస్తున్నారా.. మీకు కొత్త ఉద్యోగం వచ్చిందని కంపెనీ వదలి వెళ్తున్నారా.. మీరు ఆ కంపెనీలో పని చేసేటప్పుడు కంపెనీ వారు మిల్క్ టీ ఆఫర్ చేశారా.. అయితే మీరు రిజైన్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు.  ఉద్యోగం మానేసి.. కొత్త ఉద్యోగంలో చేరితే కష్టాలేంటనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. ఓ లుక్కేయండి..
 
చైనా మనుషులే కాదు... కంపెనీ యాజమాన్యాలు కూడా తిక్కతిక్కగా వ్యవహరిస్తాయి అనేందుకు ఈ వార్త సరిపోతుంది.  ఎవరైనా ఉద్యోగస్తులు కంపెనీ వదలి వెళ్లిపోతుంటే ఎందుకు వెళుతున్నారు.. మీకు ఇక్కడ కలిగిన ఇబ్బందులు ఏమిటి అని ఆరా తీస్తారు.  కాని చైనాలో ఓ కంపెనీలో ఇద్దరు ఉద్యోగులు రాజీనామా చేస్తే.. అప్పటి వరకు వారిపై మిల్క్ టీ కోసం వెచ్చించిన డబ్బును వసూలు చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి.  చాలామంది ఉద్యోగులు వారికి కంఫర్ట్ గా లేకపోయినా.. లేక మరేదైనా కొత్త ఆఫర్ వచ్చినా.. ఇప్పుడున్న పొజిషన్ కంటె బెటర్ పొజిషన్ కాని బెటర్ శాలరీ కాని వచ్చిందంటే పాత కంపెనీకి రిజైన్ చేసి కొత్త కంపెనీలో చేరతారు.  అయితే కంపెనీలో పని చేసేటప్పుడు ఉద్యోగులకు చాలా కంపెనీలు టీ, కాఫీ, బిస్కెట్స్ వంటివి ఇస్తుంటారు. సాధారణంగా వీటి ఖర్చు కంపెనీనే భరిస్తుంది.  కొన్ని కంపెనీలు  వీటి కోసం జీతంలో అతి కొద్ది మొత్తంలో కట్ చేసుకుంటాయి.  అయితే తాజాగా చైనాలోని ఓ కంపెనీ రిజైన్ చేసిన ఇద్దరు ఉద్యోగులనుంచి వారికి ఇచ్చిన మిల్క్ టీ పైసలు వసూలు చేసింది. 

సౌత్ చైనా లోని ఓ  కంపెనీలో ఉద్యోగం మానేసిన మాజీ ఉద్యోగుల నుండి మిల్క్ టీ ఛార్జీని కూడా యాజమాన్యం వసూలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.  చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌కి చెందిన ఓ మహిళ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.  ఆమెతో పాటుగా మరో ఉద్యోగి కూడా రిజైన్ చేశారు.  ఇక అంతే వారికి కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు వారిపై మిల్క్ టీ కోసం ఖర్చు చేసిన సొమ్మును రిటన్ చేయాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది.  వారు ఆ కార్యాలయంలో పనిచేసేటప్పుడు  ఎన్ని కప్పుల టీ తాగారో మరీ లెక్కకట్టి డబ్బులు కట్టమన్నారు.  కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఆ కంసెనీ మాజీ ఉద్యోగులు దాదాపు 17 వేల రూపాయిలు చెల్లించాల్సి వచ్చింది.  డబ్బులు కడితేనే తమకు రావలసిన బకాయిలు ఇచ్చి రిలీవింగ్ చేస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక డబ్బులు కట్టారు.

 ఈ సంఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీనిపై స్పందించి ప్రజలు ఇది యజమానుల పిచ్చికి పరాకాష్ఠ అని కొంతమంది కామెంట్ చేయగా మరికొంత మంది కంపెనీ ఉద్యోగులను  మిల్క్ టీ కోసం వెచ్చించిన  డబ్బును తిరిగి అడగడం దారుణమని పోస్ట్  చేశారు.  ఇంకొంతమంది  చైనాలో  ఆల్కహాల్‌కు బదులుగా మిల్క్ టీ అనే కొత్త పానీయం సృష్టించబడిందన్నారు.