పిచ్చికుక్కల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు

నాగర్ కర్నూల్ లో కుక్కల బెడద ఎక్కువైంది. పిచ్చికుక్కల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కుక్కల దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని.. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates