టీడీపీ, రామోజీరావుపై బొత్స ఫైర్…

టీడీపీకి అధికారం దూరమైనప్పటినుంచి తమపై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు ఏపీ మంత్రి, వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తాను మాట్లాడిన విషయాన్ని ఈనాడు వక్రీకరించిందని అన్నారు. చంద్రబాబుకు లబ్ది చేసేందుకు రామోజీరావు కధనాన్ని రాయించారని అన్నారు. ఈ విషయంపై తాను రామోజీరావుకు లెటర్ రాశానని చెప్పారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించినా అక్రమదారుల్లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారని చెప్పారు.

బీజేపీతో తాము కలుస్తామని ఎన్నడూ చెప్పలేదని అన్నారు బొత్స. ఈనాడులో ఇందుకు విరుద్దంగా రాశారని తెలిపారు. ఇందుకు రామోజీరావు వివరణ ఇవ్వలేదని చెప్పారు. తప్పుచేయడం మా సహజగుణమని తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును కాపాడుకోవడం కోసమే తప్పుగా వార్తను ప్రచురించామని రామోజీరావు వివరణ ఇవ్వాలని అన్నారు. భాషా కోవిదుల్లాగా ఏదో రాయడం సరి కాదని చెప్పారు. తాను మీడియాలో ఏం మాట్లాడానో ఈనాడు విలేకరులు చూడాలని అన్నారు. తాను అనని మాటలను పచ్చమీడియా ఎలా ప్రచురించిందని…. ఇదేనా పత్రికా స్వేచ్చంటే అని ఆయన ప్రశ్నించారు.

ఐటీ సోదాలతో చంద్రబాబు అక్రమాలు బయటపడ్డాయని అన్నారు బొత్స. స్వయంప్రకటిత మేధావి యనమల బెదిరింపులకు బయపడమని.. చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ ను మైనారిటీలకు దూరం చేయడానకి టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు

Latest Updates