
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. శుక్రవారం నాడు అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా అఖిల ప్రియ రిమాండ్లో ఉంటున్న విషయం తెలిసిందే. రేపు అనగా శనివారం నాడు అఖిల జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ న్యాయస్థానం కోట్టివేసింది.