ఫుట్ పాత్ పై ఉన్న బాక్స్ తెరవగానే పేలింది

box-explosion-on-the-footpath-in-rajendranagar

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ లో ఓ బాక్స్ పేలుడు కలకలం రేపుతోంది. పిల్లర్ నెంబర్ 279 ఫుట్ పాత్ మీద అనుమానంగా ఉన్న బాక్స్  ను తెరిచేందుకు ఓ వ్యక్తి(40) ప్రయత్నించగా.. బాక్స్ నుంచి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్స్ తెరిచిన వ్యక్తి రెండు చేతులు విరిగి రోడ్డు మీద పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి, గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లోనే మరణించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాక్స్ గురించి  పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

box explosion on the footpath in Rajendranagar

Latest Updates