బాక్సింగ్‌ డే టెస్ట్‌ అడిలైడ్‌ లో!

మెల్‌ బోర్న్‌ : రోజు రోజుకు మెల్‌ బోర్న్‌ (విక్టో రియా)లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యం లో.. ఇండియా -ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్‌ డే టెస్ట్‌‌ వేదికను మార్చాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) భావిస్తోంది. అనివార్యమైతే డిసెంబర్‌‌ 26 నుంచి 30 వరకు జరిగే ఈ మ్యాచ్‌ను అడిలైడ్‌కు తరలించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇండియాతో సిరీస్‌‌ను స్మూత్‌ గా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై చర్చించేందుకు సీఏ చైర్మన్‌ ఎర్ల్‌‌ ఎడ్డింగ్స్‌‌ వచ్చే వారం అర్జెంట్‌ మీటింగ్‌ పెడుతున్నారు. ఇందులో వేదిక మార్పుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం విక్టో రియాలో 13 వేల పాజిటివ్‌ కేసులు ఉండగా, న్యూసౌత్‌ వేల్స్‌‌లో 4 వేలు దాటాయి. అదే అడిలైడ్‌ కు వస్తే కేవలం 457 పా జిటివ్స్‌‌ ఉన్నా.. ఇందులో 445 మంది రికవర్‌‌ అయ్యారు.

Latest Updates