8ఏళ్ల కిత్రం జరిగిన రాబరీని ఛేదించిన ఆరేళ్ల బుడతడు

ఆరేళ్ల బుడతడు..8ఏళ్ల క్రితం జరిగిన రాబరీని ఛేదించాడు. లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో అమెరికా సౌత్ కెరోలినాకు చెందిన జోనాథన్ బ్రూవన్ అతని కుమారుడు నాగ్స్ బ్రూవర్ లు ఎంజాయ్ చేసేందుకు  సమీపంలో ఉన్న ద్వీపానికి వచ్చారు. రెండు నెలల తరువాత బయట ప్రపంచంలోకి రావడంతో నాగ్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తండ్రి జోనాథన్ ఒడ్డి ఉంటే బుడ్డోడు సరస్సులోని నీటి అడుగు భాగంలోకి వెళ్లి తనకు నచ్చిన వస్తువుల్ని వెతకడం ప్రారంభించారు.

అదే సమయంలో 8 ఏళ్ల క్రితం స్థానికంగా ఓ రాబరీ జరిగింది. ఓ దొంగ స్థానికంగా ఉండే  మహిళ ను బెదిరించి ఆమె  బ్యాగ్ ను దొంగిలించాడు. బ్యాగ్ తో  బ్రాస్ లెట్ తో పాటు పలు విలువైన వస్తువుల్ని లాక్కున్నాడు. ఆ వస్తువుల్ని ఓ బాక్స్ లో పెట్టి భద్రంగా సరస్సు ఒడ్డున భద్రంగా ఉంచాడు.

ఇప్పుడు అదే సరస్సులోకి దిగిన నాగ్స్ కాలికి ఈ బాక్స్ తగలడంతో తండ్రి సాయంతో ఆ బాక్స్ ను వెలికి తీశాడు. అనంతరం బాక్స్ గురించి పోలీసులు కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాక్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో మహిళ వస్తువులుగా పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రాబరీని చేదించిన ఆరేళ్ల నాగ్స్ బ్రూవర్ అతని తండ్రి జోనాథన్ బ్రూవర్ ను పోలీసులు అభినందించారు.

Latest Updates