పార్కులో ఆడుకుంటూ బాలుడి మృతి

Boy died in Rajendra nagar while playing in a park

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని హైదర్ గూడలో విషాదం చోటుచేసుకుంది. పార్క్‌లో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బిశాన్ శర్మ అనే ఆరేళ్ల బాలుడు సిమెంట్ బెంచ్‌పై ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ బెంచ్‌ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. పార్క్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే.. బాలుడు మరణించినట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates