అపార్ట్ మెంట్ పై నుంచి జారీ ప‌డి బాలుడు మృతి

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక నర్సింగ్ రావు పేటలోని ఓ అపార్ట్ మెంట్‌లో త‌‌న‌ తోటి స్నేహితులతో ఆడుకుంటూ సూర్య ప్రతాప్ (13) అనే బాలుడు మూడ‌వ అంత‌స్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో రెండు కాళ్లకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంట‌నే బాలుడి త‌ల్లిదండ్రులు అత‌డిని స్థానిక ‌ ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గాజువాక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ అక్క‌డే మృతిచెందాడు. బాలుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

boy falls to death from third floor of apartment in visakhapatnam

Latest Updates