ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. శాంతినగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు..ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. కత్తి చూపి బాలుడిని బెదిరించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు చూసి కేకలు వేయడంతో దుండగులు బాలుడిని వదిలేసి పరారయ్యారు. కిడ్నాపర్లు మారుతి వ్యాన్ లో వచ్చినట్టు బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Latest Updates