డ్రైనేజ్ లో కొట్టుకుపోయిన మూడేళ్ల బాలుడు

ముంబైలో వరదలకు జనజీవనం  అస్తవ్యస్తమైంది.  దివ్యాన్ష్  అనే మూడేళ్ల  బాలుడు  బుధవారం రాత్రి  మురుగునీటి  ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. అయితే  అతడి ఆచూకీ  ఇంత వరకు దొరకడం లేదు. బాలుడు  నీళ్లలో పడిపోయే  దృశ్యాలు  అక్కడే ఉన్న  సీసీ  కెమెరాలో రికార్డ్  అయ్యాయి. అంబేద్కర్ నగర్ లోని  గోరెగావ్  దగ్గర బుధవారం  రాత్రి  పదిన్నర గంటల  సమయంలో ఈ ఘటన  జరిగింది.

అయితే  బాలుడి ఆచూకీ  కోసం ఇవాళ కూడా   బృహన్  ముంబై కార్పొరేషన్  రెస్క్యూ టీం,  NDRF, ముంబై  పోలీసులు, స్థానికులు  గాలింపు చేపడుతున్నారు. పది కిలోమీటర్లు  ఉన్న డ్రైనేజ్ ను  రెండుసార్లు  జల్లెడ పట్టినా  బాలుడి ఆచూకీ  దొరకలేదు. ఈ ఘటనకు  బాధ్యత వహిస్తూ ముంబై  మేయర్ విశ్వనాథ్  మహదేశ్వర్  రాజీనామా చేయాలంటూ  విపక్షాలు సహా  బాలుడి తల్లిదండ్రులు  డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై  కఠిన చర్యలు  తీసుకోవాలంటున్నారు.

Latest Updates