యాప్రాల్ లో స్కూలుకెళ్లిన బాలుడి అదృశ్యం

మేడ్చల్ జిల్లా: నాలుగో తరగతి చదువుతున్న బాలుడు అదృశ్యమైన సంఘటన యాప్రాల్ లోని బాలాజీ నగర్ లో జరిగింది. ఇవాళ ఉదయం ఇంటిపక్కనే ఉన్న స్కూల్ కి వెళ్లిన ధీరజ్ రెడ్డి(9) కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపిన పోలీసులు..స్కూల్ యాజమాన్యాన్ని విచారించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates