హైదరాబాద్ లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య

హైదరాబాద్ : పహాడీషరీఫ్ లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బాలుడిని వాదే ముస్తాఫాలో నివాసం ఉంటున్న మహ్మద్ భాషా కుమారుడిగా గుర్తించారు. రంజాన్ మాసం కావడంతో.. ఉదయం అంతా నమాజ్ కు వెళ్లారు. ఫ్రూటీ తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన యాసిన్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకడంతో.. స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన నిర్మానుష్య ప్రదేశంలో శవంగా పడి ఉన్న యాసిన్ ను గుర్తించారు. బాలుడి తలపై రాళ్లతో బాదినట్లు తెలుస్తుంది.  పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Latest Updates