అన్నకొట్టాడని పారిపోయి 8 ఏళ్లకు దొరికాడు

ఎనిమిదేళ్ల కింద ఇల్లువదిలి వెళ్లిన బాలున్ని ఇంటికి చేర్చారు రాచకొండ పోలీసులు. 2011లో దినేష్(13) అనే బాలుడు… తన అన్న కొట్టాడనే కారణంతో ఇంటినుంచి పారిపోయాడు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలోని నవోదయ నగర్ లో దినేష్ కుటుంబం నివాసం ఉన్నారు. అయితే 2011లో దినేష్ ను అతని అన్న కొట్టగా ఇల్లు వదిలి పారిపోయాడు.. దీంతో..  దినేష్ కనిపించకుండా పోయాడని అతని తల్లి సునన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎంత వెదికినా కానీ లాభం లేకుండా పోయింది.

2018లో దినేష్ పంజాబ్ లో ఉన్నట్లు ఫేస్ బుక్ ద్వారా గుర్తించాడు అతని అన్న. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో.. దినేష్ పంజాబ్ లోని ‘రన్ కాల’ అనే గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. ఒక స్పెషల్ టీం పంజాబ్ కు వెళ్లి.. దినేష్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం దినేష్ వయసు 21. తన కన్న కొడుకును చూసి కన్నీటి పర్యంతమయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది దినేష్ తల్లి.

Latest Updates