వెబ్ సిరీస్ చూస్తూ 75మందిని కాపాడాడు

18ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో స్టార్ అయ్యాడు. నెటిజన్లు అతడిని హీరో అని పొగిడేస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా..?

మహరాష్ట్ర డొంబివిలి ప్రాంతానికి చెందిన ఓ రెండంతస్తుల అపార్ట్ మెంట్ నేలమట్టమైంది. అ అపార్ట్ మెంట్ లో ఉంటున్న 75మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దానికి కారణం 18ఏళ్ల కునాల్. కునాల్ కు వెబ్ సిరీస్ పిచ్చి ఎక్కువ. ఆ పిచ్చితో రాత్రి నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు వెబ్ సిరీస్ చూస్తున్నాడు. సరిగ్గా తెల్లవారు జాము 4గంటల సమయంలో ఈ 75మంది నిద్రిస్తున్న అపార్ట్ మెంట్ కిచెన్ లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన కునాల్ రెండంతుస్తుల్లో నిద్రిస్తున్న వారిని అప్రమత్తం చేశాడు. వాళ్లు అలా అపార్ట్ మెంట్ నుంచి సురక్షితంగా బయటపడ్డారో లేదో..అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

అయితే 9నెలల క్రితమే డొంబివిలి ప్రాంతానికి చెందిన కొన్ని అపార్ట్ మెంట్లు కూలిపోతాయని అధికారులు నోటీసులిచ్చారని కునాల్ చెప్పాడు. కానీ  కానీ కరోనా కారణంగా చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి బయటకు వెళ్లలేదన్నాడు. కాగా 75మందిని కాపాడిన కునాల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Latest Updates